హైదరాబాద్‌ః నిమ్స్ రెసిడెంట్ డాక్టర్ల సమ్మె మరింత తీవ్రరూపం దాల్చింది. డ్యూటీలో వున్న నర్స్‌పై చేయిచేసుకోవడంతో పాటు డాక్టర్‌పై దౌర్జన్యం జరిపిన రోగి బంధువులపై చర్య తీసుకోవాలని సెక్యురిటీ వ్యవస్థను మార్చాలని డిమాండ్ చేస్తూ రెసిడెంట్ డాక్టర్లు సమ్మె చేస్తున్న షయం దితమే.
తక్షణమే ధుల్లో చేరాల్సిందిగా నిమ్స్ యాజమాన్యం రెసిడెంట్ డాక్టర్లకు నోటీసులు జారీచేయడంతో సమ్మె కొత్త మలుపు తిరిగింది. తాము కోరినట్టుగా నిమ్స్ యాజమాన్యం ఇంతవరకు సెక్యురిటీని మార్చలేదని, నర్సుపై దాడి జరిగిన సమయంలో చోద్యం చూస్తూవున్న సెక్యురిటీ సిబ్బంది ఎవరో ఇంతవరకు గుర్తించలేదని రెసిడెంట్ డాక్టర్లు ఆరోపిస్తున్నారు. డాక్టర్ల రక్షణ షయంలో నిమ్స్ యాజమాన్యం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నదని వారు ఆరోపించారు. మంగళవారం నుంచి సమ్మెను మరింత తీవ్రం చేయనున్నట్టుగా ప్రకటించారు.












Click it and Unblock the Notifications
