కర్నూలుః కర్నూలు జిల్లాలోని వెలుగోడు రిజర్వాయర్‌కు గండి ప్రమాదం ఏర్పడింది. తెలుగుగంగ ప్రాజెక్టులో ఒకటైన వెలుగోడు రిజర్వాయర్‌కు గండి పడే ప్రమాదంఏర్పడటంతో జిల్లాలో తీవ్ర ఆందోళనకర పరిస్థితి నెలకొన్నది.
రిజర్వాయర్ దిగువ గ్రామాల ప్రజలను అధికారులు యుద్ధప్రాతిపదికపై సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రిజర్వాయర్‌లో సుమారు 7.2 టిఎంసీల జలాలు వున్నాయని ఒకవేళ గండిపడితే దిగువన వున్న 60 గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదం వున్నది. నాసిరకం నిర్మాణ పనుల వల్లనే రిజర్వాయర్‌కు ఈ దుస్థితి వచ్చిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియని భయంలో ఆదివారం రాత్రంతా కంటిdుద కునుకులేకుండా గడిపామని దిగువ గ్రామాల ప్రజలు చెప్పారు. వెలుగోడు రిజర్వాయర్‌కు కరకట్ట దెబ్బతిన్న షయం తెలిసిన వెంటనే రాష్ట్ర మంత్రులు మండవ వెంకటేశ్వరరావు, ఫరూఖ్, జిల్లా మంత్రి కెఇ ప్రభాకర్ వెంటనే బయలుదేరి వచ్చారు. మంత్రులు ఆదేశంపై అధికారులు మరమ్మతులు చేపట్టారు. రిజర్వాయర్ నిర్మాణంలో అక్రమాలకు పాల్పడిన అధికారులు, కాంట్రాక్టర్లపై కఠిన చర్యతీసుకోవడం జరుగుతుందని మంత్రి మండవ ప్రకటించారు. వెలుగోడు రిజర్వాయర్ రక్షణకు దీర్ఘకాలిక ప్రణాళిక సిద్ధం చేయాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం అధికారులను ఆదేశించారు.












Click it and Unblock the Notifications
