జనవరిలో భారత్ రానున్న బ్లెయిర్
లండన్‌ఃబ్రిటన్ ప్రధాని టోనీ బ్లెయిర్ వచ్చే ఏడాది జనవరిలో భారత్ పర్యటించనున్నారు.బ్రిటన్ లో పర్యటిస్తున్న భారత ప్రధాని వాజ్‌పేయి ఈ మేరకు చేసిన ఆభ్యర్థనను బ్లెయిర్‌అంగీకరించారు. దౌత్యపరమైన లాంఛనాల అనంతరం ఖచ్చితమైన తేదీని నిర్ణయిస్తానని బ్లెయిర్ లండన్ లో తెలిపారు.
ఆంతకు ముందు వాజ్‌పేయి బ్లెయర్ ఉమ్మడి లేకరుల సమావేశంలో మాట్లాడారు. బ్లెయిర్ ఆహ్లానం మేరకే తాను ఇక్కడికి వచ్చినట్లు వాజ్‌పేయి చెప్పారు. ఫోన్ లో మాట్లాడితే ముఖాముఖి మాట్లాడం వల్ల కలిగిన ఆనందం రాదని వాజ్‌పేయి చమత్కరించారు.
ఉమ్మడి లేకరుల సమావేశాలనికి ముందు వాజ్‌పేయి - బ్లెయిర్ ముఖాముఖి సమావేశం అయ్యారు. ఉభయుల చర్చల్లో ఆఫ్గన్ యుద్ధం, తీవ్రవాదం, రక్షణ తదితరఅంశాలు చర్చకు వచ్చినట్లు తెలిసింది.












Click it and Unblock the Notifications
