ఆకాశంలోనే ముక్కలైనజెట్
న్యూయార్క్‌ః సోమవారం ఉదయం న్యూయార్క్ లో కుప్పకూలిన అమెరికన్ ఎయిర్ లైన్స్ ఎ-300 నుంచి 265 మృత దేహాలను వెలికి తీశారు. మృతులలో ఐదుగురు పసిపిల్లలు, 9 మంది మాన సిబ్బంది, 246 ప్రయాణికులు వున్నారు. ఈ ప్రమాద కారణాలను కనుగొనేందుకు దర్యాప్తు సంస్థలు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నాయి. మానం ఆకాశంలోనేపేలిపోయిందని, కొన్ని శకలాలు దూరంగా సిరివేయబడడాన్ని బట్టి మానం కూలిపోక ముందే ముక్కలైందని భాస్తున్నారు. ఇందులో ఏదైనా ద్రోహ చర్య వున్నదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
న్యూయార్క్ ప్రజలు తాజా పత్తును ధైర్యంగా ఎదుర్కోవాలని అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్‌కోరారు. దక్షిణాఫ్రికా నేత నెల్సన్ మండేలాతో చర్చలు జరుపుతున్న సందర్భంగా ఈ షయం తెలుసుకున్న బుష్ న్యూయార్క్ ప్రజలకు సానుభూతి తెలిపారు. పలు ప్రపంచ దేశాలు కూడా ఈ సంఘటన పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.బ్రిటన్ అధ్యక్షుడు టోనీ బ్లెయిర్, దోహాలో జరుగుతున్న వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ సదస్సు కూడా మాన ప్రమాదం పట్ల సంతాపం తెలిపాయి.
ఈ ప్రమాదంలో నాలుగు ఇళ్ళు పూర్తిగా ధ్వంసమయ్యాయని, మరో నాలుగు ఇళ్ళు పాక్షికంగా దెబ్బతిన్నాయని న్యూయార్క్ మేయర్ వరించారు. మాన ప్రమాదంతో ముందు జాగ్రత్త చర్యగా ధ దేశాలనుంచి న్యూయార్క్ వెళ్లే మానాలను రద్దు చేయడం, లేదా దారి మళ్ళించారు.












Click it and Unblock the Notifications
