కాబూల్‌ః అఎn్గాన్ యుద్ధంలో తాలిబన్లు పూర్తిగా చేతులెత్తేశారు. తాలిబన్ల ఆధ్యాత్మిక గురువు ముల్లా ఒమర్ దేశం డిచి పాకిస్తాన్‌కు పారిపోయినట్టుగా తెలిసింది. దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాలను నార్తర్న్ అలయెన్స్ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
కాందహార్‌లోని తాలిబన్ల బలమైన కేంద్రాలు కూడా అలయెన్స్ పట్టులోకి వచ్చాయి. అయితే ముల్లా ఒమర్, ఒసామాబిన్ లాడెన్ జాడ మాత్రం ఇంకా దొరకలేదు. dరిద్దరికోసం గాలింపు ముమ్మరంగా సాగుతున్నది. చాలా చోట్ల తాలిబన్ బలగాలు లొంగిపోయాయి. మరికొన్ని చోట్ల ఇంకా కడదాకా పోరాడుతున్నారు. ముల్లా ఒమర్ పాకిస్తాన్‌కు పారిపోయినట్టుగా శ్వసనీయంగా తెలిసిందని నార్తర్న్ అలయెన్స్ కమాండర్ ఒకరు చెప్పారు. కాగా ఒసామా బిన్ లాడెన్ ఇంకా అఎn్గాన్ కొండల్లోనే ఎక్కడో దాక్కుని వుంటాడని అంటున్నారు.












Click it and Unblock the Notifications
