తెలుగులోకి 'హనుమాన్ అంశ్'.. సెప్టెంబర్ 18 న గ్రాండ్ రిలీజ్.. త్రివిక్రమ్ మ్యాజిక్..

రూ. 2 కోట్లతో తీసిన సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 150 కోట్లకు పైగా కలెక్ట్ చేసిందంటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. అది కూడా ఎలాంటి స్టార్ కాస్ట్, ప్రమోషన్లు, అంచనాలు లేకుండా సైలెంట్ బాలీవుడ్ లో రిలీజ్ అయిన ఓ చిన్న సినిమా గురించి ఇప్పుడు యావత్ దేశం మొత్తం మాట్లాడుకుంటుంది. అదే "హనుమాన్ అంశ్" చిత్రం.. ఈ సినిమాను ఇంతలా ఆదరించడానికి గల కారణం ఏంటి..? అని అనుకుంటున్నారా..? ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలీ బాబా జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందింది. కేవలం ప్రేక్షకుల మౌత్ టాక్ తో పుంజుకుని ఇప్పుడు ఏకంగా రూ. 150 కోట్లకు పైగా కలెక్షన్లు కొళ్లగొట్టింది. అయితే ఇప్పుడు ఈ మూవీ తెలుగులోనూ రాబోతోంది. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ హనుమాన్ అంశ్ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు.

త్రివిక్రమ్‌ సమర్పణలో ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌ ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 18 న తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయనుంది. నీమ్‌ కరోలి బాబా భక్తుల భావోద్వేగాలను, ఆయన జీవితంలోని ముఖ్య ఘట్టాలను అద్భుతంగా ఆవిష్కరించిన ఈ ఆధ్యాత్మిక సినిమా తెలుగు ప్రేక్షకులను కూడా ఎంతగానో ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. భక్తి రస చిత్రాలను ఆదరించడంలో తెలుగు ప్రేక్షకులు ముందుంటారు. ఆ కారణంతోనే ఈ సినిమాను తెలుగులోనూ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఇక హనుమాన్ అంశ్ చిత్రానికి విశాల్ చతుర్వేది దర్శకత్వం వహించారు. అలాగే ఈ చిత్రంలో శోభినావ్ సత్య, విహాన్ శెడ్గే ప్రధాన పాత్రల్లో నటించారు.

HanumanAnsh bollywood movie in Telugu Grand release on September 18th Hanuman Ansh Trivikram magic

ఆగస్టు 7 న ఈ మూవీ రిలీజ్ అయింది. మౌత్ టాక్ తోనే నెల రోజులకు పైగా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటి వరకూ ఈ సినిమాకు రూ.150 కోట్లకు పైగానే కలెక్షన్లు వచ్చాయి. ఈ చిత్రాన్ని మూడు భాగాల్లో రూపొందించనున్నారు దర్శకుడు విశాల్ చతుర్వేది. హనుమాన్ అంశ్ పేరుతో మొదటి భాగం వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రెండో భాగం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ మూవీలోని రెండో భాగం వచ్చే ఏడాది రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+