రేపట్నుంచి టీమిండియా టీ20 జాతర

శ్రేయాస్ అయ్యర్ సారథ్యంలోని భారత టీ20 జట్టు ఇటీవలే జింబాబ్వే పర్యటనను దిగ్విజయంగా ముగించుకుంది. ఈ సిరీస్ ను 3-0 తేడాతో కైవసం చేసుకుంది. అంతకుముందు ఐర్లాండ్, ఇంగ్లాండ్ లల్లో చవి చూసిన పరిపూర్ణ ఓటముల గాయాన్ని జింబాబ్వే సిరీస్ కొంతవరకు నయం చేయగలిగింది. ఇక.. మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ ఆడబోతోంది. ఆఫ్ఘనిస్తాన్ తో తలపడబోతోంది. ఈ మూడు మ్యాచ్ లకు ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం ఆతిథ్యాన్ని ఇస్తోంది. అన్ని మ్యాచ్‌లు రాత్రి 7:30 గంటలకు ప్రారంభమౌతాయి.

కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో బరిలోకి దిగుతున్న టీమిండియా.. జింబాబ్వేపై సాధించిన విజయ పరంపరను కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. తుది జట్టును ఎంపిక చేయడం పెద్ద సవా వాల్‌గా మారింది. స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ జట్టులోకి తిరిగి రావడంతో ఈక్వేషన్లు మారాయి. జింబాబ్వే పర్యటనకు దూరమైన శాంసన్ ఇప్పటివరకు ఆడిన 14 మ్యాచ్‌ల్లో 180.99 స్ట్రైక్ రేట్‌తో ఏకంగా 400 పరుగులు సాధించాడు. ఇందులో మూడు అర్ధ సెంచరీలు ఉన్నాయి.

India First T20 Match vs Afghan on Sept 13 as Abhishek Sharma Sanju Samson and Vaibhav Sooryavanshi

టీమిండియా ఓపెనింగ్ స్థానం కోసం గట్టి పోటీ నెలకొంది. జింబాబ్వే సిరీస్‌లో వరుసగా రెండు హాఫ్ సెంచరీలు సాధించి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అందుకున్న వైభవ్ సూర్యవంశీ వైపే మేనేజ్‌మెంట్ మొగ్గు చూపే అవకాశం ఉంది. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ ప్రస్తుత ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. గత మూడు మ్యాచ్‌ల్లో అతను కేవలం 11 పరుగులు మాత్రమే చేశాడు. మొదటి మ్యాచ్‌లో అభిషేక్ రాణించకపోతే, మిగిలిన రెండింటికీ సంజూ శాంసన్‌ను ఓపెనర్‌గా పంపే అవకాశం ఉంది.

టీమిండియాకు అందుబాటులో స్టార్ ఆల్ రౌండర్: బుమ్రా, నితీష్ భవితవ్యం తేలేది రేపే
టీమిండియాకు అందుబాటులో స్టార్ ఆల్ రౌండర్: బుమ్రా, నితీష్ భవితవ్యం తేలేది రేపే

వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ కూడా ఓపెనర్ రేసులో ఉన్నాడు. దులీప్ ట్రోఫీ ఫైనల్లో సౌత్ జోన్‌పై 270 పరుగుల రికార్డు ఇన్నింగ్స్‌తో ఇషాన్ తన ఫామ్‌ను నిరూపించుకున్నాడు. దీంతో అతను నాలుగో స్థానంలో ఆడే అవకాశాలు ఉన్నాయి. ఇక మిడిల్ ఆర్డర్‌లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, వైస్ కెప్టెన్ తిలక్ వర్మ జట్టుకు వెన్నెముకగా నిలవనున్నారు.

చైనా అధ్యక్షుడి విమానం స్పెషాలిటీస్: ఎయిర్ ఫోర్స్ వన్ కూడా దిగదుడుపే
చైనా అధ్యక్షుడి విమానం స్పెషాలిటీస్: ఎయిర్ ఫోర్స్ వన్ కూడా దిగదుడుపే

ఆల్‌రౌండర్ కోటాలో ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై తర్జన భర్జన జరుగుతోంది. శివమ్ దూబే, నితీష్ కుమార్ రెడ్డిల్లో ఒకరికి అవకాశం దక్కొచ్చు. ఎవరిని ఆడిస్తారనేది పిచ్ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. బ్యాటింగ్ డెప్త్ పెంచాలనుకుంటే దూబే వైపు, బౌలింగ్ ఆప్షన్ వైపు మొగ్గు చూపితే నితీష్ రెడ్డిని ఎంపిక చేసే అవకాశం ఉంది. బౌలింగ్ విభాగంలో మేనేజ్‌మెంట్ జస్‌ప్రీత్ బుమ్రా ఫిట్‌నెస్‌పై దృష్టి సారించింది. అర్ష్‌దీప్ సింగ్, స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ ఈ మ్యాచ్ లో కీలకం కానున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+