అలయెన్స్‌ దూకుడుపై పాక్‌ ఆగ్రహం

ఇస్లామాబాద్‌ః అమెరికా మాటను ఖాతరు చేయకుండా నార్తర్న్‌ అలయెన్స్‌ దళాలు కాబూల్‌లోకి చొచ్చుకుపోయి కాబూల్‌పై తమ జెండా ఎగురవేసిన సంఘటన పాకిస్తాన్‌లో తీవ్ర కలవరాన్ని సృష్టించింది. కాబూల్‌ ఏ ఒక్క గ్రూప్‌ ఆధీనంలోనూ వుండరాదని పాకిస్తాన్‌ డిమాండ్‌ చేసింది. తక్షణమే ఐక్యరాజ్య సుతి అంతర్జాతీయ బలగాలను పంపి కాబూల్‌ను తమ స్వాధీనంలోకి తీసుకుని కొత్త ప్రభుత్వం ఏర్పాటుకుమార్గం సుగమం చేయాలని పాకిస్తాన్‌ కోరింది. అఎn్గాన్‌లో ప్రభుత్వం ఏర్పాటు ఏ ఒక్క గ్రూప్‌ వల్లా కాదని పాకిస్తాన్‌ పేర్కొంది. కాబూల్‌లోకి నార్తర్న్‌ అలయెన్స్‌ బలగాలు ప్రవేశించడం పట్ల అమెరికా కూడా కినుకగా వుంది.

తన ఆదేశాలను కాదని అలయెన్స్‌ సేనలు కాబూల్‌లో ప్రవేశించడం అమెరికాకు కూడా ఆగ్రహం కలిగించింది. అతనికంటే ఘనుడన్నట్టుగా నార్తర్న్‌ అలయెన్స్‌కు వున్న ఘనమైన చరిత్ర దృష్ట్యా తాము కూడా భయపడుతున్నట్టుగా ఐక్యరాజ్య సుతి మానవహక్కుల కుషన్‌ పేర్కొంది. అఎn్గాన్‌ మాజీ రాజు జహీర్‌షా సైతం కాబూల్‌ నార్తర్న్‌ అలయెన్స్‌ బలగాల వశం కావడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏర్పాటుకు ఎలాంటి చొరవతీసుకోరాదని అలయెన్స్‌కు ప్రపంచదేశాలు జ్ఞప్తి చేశాయి. ఇదిలా వుండగా తాలిబన్లు పలాయన మంత్రం పఠించిన షయం తెలిసిన వెంటనే కాబూల్‌పురdథుల్లో ప్రజలు ఆనందంతో కదం తొక్కారు. తాలిబన్ల పాలనలో అన్ని రకాల స్వేచ్చలను కోల్పోయిన వారు సినిమా తారల ఫోటోలతో dధుల్లోకి వచ్చారు. సంగీతంతో హోరెత్తించారు. ఖాళీ అయిన పాకిస్తాన్‌ రాయబారకార్యాలయాన్ని కొందరు దోచుకున్నారు. మరికొందరు తాలిబన్లకు సంబంధించిన ఆస్తులపై పడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+