కాబూల్ నుంచి తాలిబన్ల పలాయనం
కాబూల్‌ః నార్తరన్ అలయెన్స్‌సేనలు కాబూల్ సdుపానికి చేరుకోగానే తాలిబన్లు కాబూల్ నుంచి పలాయనం చిత్తగించారని పౌరులు తెలిపారు. మంగళవారం ఉదయం నార్తరన్ అలయెన్స్‌సేనలు కాబూల్ ను స్వాధీనం చేసుకొనే సమయంలో అక్కడ ఒక్క తాలిబన్ సైనికుడు కూడా కనిపించలేదు. పోరాటంలో మరణించిన కొందరు తాలిబన్ల మృత దేహాలు మాత్రం అక్కడక్కడ పడివున్నాయి.
నార్తరన్ అలయన్స్‌సేనలు కాబూల్ రావడానికి కొద్ది సమయానికి ముందు కూడా అమెరికా యుద్ధ మానాలు కాబూల్ పై బాంబుల వర్షం కురిపించాయి. ఓ వైపు బాంబు దాడులు, మరోవైపు నార్తరన్ అలయెన్స్ దూకుడుతో తాలిబన్లంతా పలాయనం చిత్తగించారు. తాలిబన్లను ఆఫ్ఘనిస్తాన్ పశ్ఛిమ దిశకు తరిువేస్తామని అలయెన్స్‌సేనలు ప్రకటించాయి.












Click it and Unblock the Notifications
