ఇస్లామాబాద్‌ః అఎn్గానిస్తాన్‌లో నార్తర్న్ అలయన్స్ జయాల పట్ల పాకిస్తాన్ మాజీ ప్రధాని, పాకిస్తాన్ పీపుల్స్‌పార్టీ నేత బేనజీర్ భుట్టో హర్షం వ్యక్తం చేశారు. కాబూల్ నుంచి తాలిబన్లను తరిమేసి నార్తర్న్ అలయన్స్ దళాల పట్టణాన్ని వశం చేసుకోవడం పట్ల ఆమె హర్షం ప్రకటించారు.
అఎn్గానిస్తాన్‌లోని భిన్న తెగలు, జాతుల ప్రజలు ఒక్కటైప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని తాము ఆకాంక్షిస్తున్నట్టుగా బేనజీర్ చెప్పారు. యుద్ధం కారణంగా చితికిపోయిన అఎn్గాన్ ప్రజల బతుకులకు భష్యత్తుపై ఆశ కల్పించడం కొత్త ప్రభుత్వం బాధ్యత అని ఆమె అన్నారు.
నార్తర్న్ అలయన్స్ పుష్తు తెగకు దగ్గరకావల్సిన అవసరం వున్నదని కూడా ఆమె సూచించారు. నార్తర్న్ అలయన్స్‌లో ప్రధానంగా మైనార్టీలైన ఉజ్బెక్, హజారా, తజిక్ తెగలవారు వున్నారు. కాగా అఎn్గాన్ జనాభాలో పుష్తు తెగ 40 శాతం వుంటుంది. అఎn్గాన్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు పాకిస్తాన్ తగిన పాత్ర పోషించలేకపోతున్నదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అఎn్గాన్‌లో సుస్థిరత పాకిస్తాన్ చిత్తశుద్దిపైనే ఆధారపడివుంటుందని ఆమె తెలిపారు.












Click it and Unblock the Notifications
