ఇస్లామాబాద్‌ః యుద్ధం ముగింపు దశకు రావడంతో ఆఫ్ఘనిస్తాన్ నుంచి బయటకు వెళ్ళే దారులన్నీ మూసివేయాల్సిందిగా పాకిస్తాన్ ఆదేశించింది. ఏ మాత్రం సందు దొరికినా ఒసామాబిన్ లాడెన్ పలాయనం చిత్తగించే ప్రమాదం వున్నందున ఆఫ్ఘన్ నుంచి వచ్చే దారులన్నీ మూసేయాల్సిందిగా సరిహద్దు భద్రతా దళాలను కోరింది. సరిహద్దుల్లో ఒసామా అలర్ట్ ప్రకటించినట్లు పాక్ ులటరీ ఉన్నతాధికారులు వెల్లడించారు.
తాలిబన్ నేత ముల్లా ఓమర్,బిన్ లాడెన్ ఇంకా ఆఫ్ఘనిస్తాన్ లోనే క్షేమంగా వున్నారని తాలిబన్ ప్రతినిధి చెబుతున్నారు. అయితే ఆఫ్ఘనిస్తాన్ ప్రజల అభిమానం వున్నంత వరకుబిన్ లాడన్ ను పట్టుకోవడం అంత తేలిక కాదని రష్యా,బ్రిటన్ తో సహా అన్ని దేశాలు అంగీకరిస్తున్నాయి.












Click it and Unblock the Notifications
