ఆంధ్రపోలీసులకు కొత్త మాన్యువల్
హైదరాబాద్‌ః ఆంధ్రప్రదేశ్ పోలీసులకోసం కొత్త మాన్యువల్‌ను రాష్ట్ర ప్రభుత్వం గురువారం నాడు డుదల చేసింది. పాతమాన్యువల్‌లోని అంశాలను తీసుకుని మారిన పరిస్థితులకు అనుగుణంగా కొత్త అంశాలను కూడా చేర్చి మూడు సంపుటాలుగా ఈ కొత్త మాన్యువల్‌ను వెలువరించారు.
కాలం చెల్లిన చట్టాలను ఎప్పటికప్పుడు వదిలించుకుని మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కొత్త చట్టాలను రూపొందించుకోవల్సిన అవసరం వున్నదని మాన్యువల్‌ను డుదల చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. ఈ కొత్త మాన్యువల్ వచ్చే ఏడాది జనవరి నుంచి అమల్లోకి వస్తుంది. ఏ గ్రేడ్ మున్సిపాల్టీల్లో శాంతిభద్రతలకు, నేరపరిశోధనకు డిడిగా పోలీసుస్టేషన్లను ఏర్పాటు చేయాలని మాన్యువల్ నిర్ధేశించింది.
ప్రజలకు పోలీసులు మరింత సన్నిహితం కావాలని, బలహీనవర్గాలు హక్కుల పరిరక్షణకు గట్టి చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నది. శాస్త్రీయ పద్దతిలో నేరపరిశోధనకు కొత్త మాన్యువల్ పెద్దపీట వేస్తున్నది. అంతే కాకుండా మహిళా పోలీసుల సంఖ్యను కూడా గణనీయంగా పెంచాలని ప్రతిపాదించారు. మాన్యువల్‌లోని అంశాలపై తమకు కొన్ని అభ్యంతరాలు వున్నాయని పోలీసు అధికారుల సంఘం ప్రకటించింది.












Click it and Unblock the Notifications
