కాబూల్‌ః అమెరికాపై చావు దెబ్బతీయడానికి తగిన పథకాలను సిద్ధం చేస్తున్నట్టుగా తాలిబన్ల నేత ముల్లా ఒమర్ ప్రకటించారు. బిబిసి పుష్తూ భాషా సర్వీసుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అఎn్గాన్‌లో భష్యత్తులో ఏర్పడే ప్రభుత్వం ఎలాంటిదైనా దానికి తాము సహకరించడం కలలో మాట అని కూడా ముల్లా ఒమర్ స్పష్టం చేశారు.
కాందహార్ ఇప్పటికీ తమ అధీనంలోనే వున్నదని ఆయన వెల్లడించారు. అమెరికాను ధ్వంసం చేయడానికి తమ వద్ద బృహత్ పథకాలు వున్నాయని వెల్లడించారు. కొత్త ప్రభుత్వాన్ని తాము ఫిశాచాల ప్రభుత్వంగా భాస్తున్నామని అలాంటి ప్రభుత్వంలో భాగస్వాములుగా చేరడం కన్నా మరణమే మంచిదని తాలిబన్లు భాస్తున్నారని ఆయన వెల్లడించారు.
దైవేచ్ఛ ప్రకారం అమెరికా ధ్వంసానికి సంబంధించిన తమ పథకం అమలవుతుందని ఆయన చెప్పారు. దైవం అనుకూలిస్తే త్వరలోనే తమ పథకం ఫలించే అవకాశం వున్నదని చెప్పారు. అఎn్గాన్‌లో కనీసం నాలుగయిదు రాష్ట్రాలు ఇంకా తమ ఆధీనంలోనే వున్నాయని వెల్లడించారు. పరాజయాలను తాము లెక్కచేయడం లేదని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications
