కాందహార్‌ః దాదాపు మెజార్టీ రాష్ట్రాలను నార్తర్న్ అలయన్స్ దళాలు స్వాధీనం చేసుకున్నాయి. అయితే కాందహార్ మాత్రం ఇంకా తాలిబన్లపట్టులోనే వుంది. ధ ప్రాంతాలను నుంచి రుంచుకుని పరారయివచ్చిన తాలిబన్ సేనలు కాందహార్‌ను కేంద్రంగా చేసుకుని అలయన్స్ దళాలతో భీకరంగా పోరాడుతున్నాయి.
తమ దెబ్బకు అలయన్స్ సేనలు వెనుతిరిగి పారిపోతున్నాయని తాలిబన్లు ప్రకటించారు. అయితే అలయన్స్ దళాలకు అండగా రంగంలోకి దిగిన అమెరికా కాందహార్‌పై భయంకరంగా బాంబులు కురిపిస్తున్నది. అమెరికా కురిపించిన బాంబులతో ఒక ఇంట్లో వున్న ఎనిుదిమంది అల్‌ఖైదా సైనికులు మరణించినట్టుగా తాలిబన్లు వెల్లడించారు.
అమెరికా అండ కారణంగా తాము కాందహార్‌పై కూడా జయకేతనం ఎగురవేయగలమని అలయన్స్ దళాలు ధీమాగా వున్నాయి. కాందహార్‌ను తాలిబన్లనుంచి ముక్తి చేస్తే వ్యూహాత్మకంగా అఎn్గాన్ యుద్ధం ముగిసినట్టేనని అమెరికా భాస్తున్నది. చావడానికైనా సిద్ధమే కాని తాను మాత్రం అమెరికా చేతికి చిక్కేది లేదని అల్‌ఖైదా నేత ఒసామాబిన్ లాడెన్ ప్రకటించినట్టుగా తాలిబన్లు ప్రకటించారు. లాడెన్, ముల్లా ఒమర్ ఇద్దరూ అఎn్గాన్‌లోనే సురక్షితంగా వున్నారని వారు తెలిపారు.












Click it and Unblock the Notifications
