పోర్ట్ ఎలిజబెత్‌ః తొలిటెస్ట్ లో ఘోరపరాజయం పాలైన గూంగూలీ బృందం రెండో టెస్ట్ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నది. సౌతాఫ్రికాతో శుక్రవారం ప్రారంభమైన రెండో టెస్ట్ లో భారత్ బౌలింగ్ లో ఏ మాత్రం పసలేదని ఓపెనర్ గిబ్స్ నిరూపించాడు. 155 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గంగూలీ బృందం తొలిరోజు ఆట ముగిసే సమయానికి 5 కెట్లకు 237 పరుగులు చేసింది. ఓపెనర్ గిబ్స్, కెప్టెన్ షాన్ పోలాక్ లు ఆడుతున్నారు.
భారత బౌలర్లలో పాతకాపు శ్రీనాధ్ కు 3,అగార్కర్ కు ఒకటి, హర్భజన్ కు ఒక కెట్ లభించాయి. కుంబ్లే 22 ఓవర్లు బౌల్ చేసి కేవలం 36 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అయితే అతని ఖాతాలో కెట్లు ఏdు లేకపోవడం శేషం.












Click it and Unblock the Notifications
