హైదరావిాద్‌ః కూకట్ పల్లిలోని గుంటూరు కాస్ జూనియర్ కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదువుతున్న హరికిరణ్ వర్మ అనే ద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం ఉదయం క్లాసులకు హాజరయిన వర్మ ఆ తరువాత హస్టల్ గదిలోకి వెళ్ళి టవల్ తో ఫ్యాన్ కు ఉరివేసుకు చనిపోయాడు. ఈ షయాన్ని ద్యార్థులు కళాశాల యాజమాన్యానికి చెప్పగా వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గత ఏడాది కాలంలో రెసిడెన్షియల్ కళాశాలల్లో చదువుతున్న ద్యార్థులు పదిమందికిపైగా ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ దారుణంపై ప్రభుత్వం ప్రొఫెసర్ నీరదా రెడ్డి అధ్యక్షతన కుటీ వేసింది. అయితే ఆ కుటీ సిఫారసుల అమలులో తాత్సారం చేస్తున్నది.
భీమవరానికి చెందిన కృష్ణంరాజు దంపతులురైల్వే కాంట్రాక్టులు చేసుకుంటూ ఎఎస్ రావు నగర్ లో నివసిస్తున్నారు. వారు తమ కుమారుడు వర్మను గుంటూరు కాస్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలో చేర్పించారు. లెక్కల్లో సరిగా మార్కులు రావడం లేదని వర్మ బాధపడుతూ వుండేవాడని అతనిస్నేహితులు చెబుతున్నారు. కాలేజీ యాజమాన్యం బాధ్యతారాహిత్యం వల్లే తమ కుమారుడు మరణించాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications
