బయటి వ్యక్తుల నాయకత్వంపై వేటు

హైదరాబాద్‌: కంపెనీలు, సంస్థల్లో ఉద్యోగులు కాని వ్యక్తులు కార్మిక సంఘాల నాయకులు అయ్యే అవకాశం లేకుండా చట్ట సవరణ తెచ్చేఅంశంపై చర్చ జరిపి, తగిన చర్య చేపట్టాలని రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయించింది. సోమవారం ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగన మంత్రి వర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ చట్ట సవరణపై చర్చ జరిపి కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించి తగిన చర్యలు చేపట్టాలని, చట్ట సవరణపై తొందరపాటు తగదని మంత్రి వర్గం అభిప్రాయపడింది.

కార్మిక చట్టాల సవరణఅంశంతో పాటు కరెంట్‌ సరఫరా, పనికి ఆహార పథకం అమలు, ధాన్యంసేకరణ, ఆదరణ నdకరణ, పట్టణ ప్రాంత భూఆక్రమణల క్రమబద్దీకరణ వంటిఅంశాలపై కూడా చర్చ జరిగింది.
జస్టిస్‌ పున్నయ్య కుషన్‌ సిఫారసు ప్రకారం ఏర్పాటు చేయదలిచిన రాష్ట్ర ఎస్‌సి, ఎస్‌టి కుషన్‌కు సిల్‌ కోర్టుకు ఉండే అధికారాలు కల్పించాలని రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయించింది. బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టిన తర్వాత చట్టంగా మారే ముందు రాష్ట్రపతి ఆమోదం తీసుకోవాల్సి వుంటుందని న్యాయశాఖ అభిప్రాయపడింది. దీంతో ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వానికి పంపాలని రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయించింది.

.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+