హైదరాబాద్‌ః పనికి ఆహారం పథకంలో అక్రమాలకు పాల్పడేవారిని ప్రాసిక్యూట్ చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్లను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. పనికి ఆహారం పథకం, ధాన్యానికి మద్దుతు ధరపై ఆయన మంగళవారం నాడు జిల్లాకలెక్టర్లతో డియోకాన్ఫరెన్స్ జరిపారు.
పనికి ఆహారం పథకంలో అక్రమాలకు పాల్పడేవారు అధికారులైనా, ప్రజాప్రతినిధులైనా ప్రభుత్వం ఉపేక్షించదని వారిని ప్రాసిక్యూట్ చేస్తుందని ముఖ్యమంత్రి హెచ్చరించారు. రైతులకు మద్ధతు ధర లభించేలా అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన కలెక్టర్లను ఆదేశించారు. ఈ షయంలో రైతులను మోసగించడానికి ప్రయత్నించే ుల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని వారిని ప్రాసిక్యూట్ చేయాలని కలెక్టర్లకు ఆయన సూచించారు. పనికి ఆహారం పథకం కింద మొత్తం ఆరు లక్షల టన్నుల బియ్యం కేటాయించగాఅందులో రెండున్నర లక్షల టన్నులు మాత్రమే ఇప్పటివరకు వెచ్చించారు.












Click it and Unblock the Notifications
