కాబూల్‌ః ఇప్పటికీ తాలిబన్ల ఆధీనంలో వున్న కుందుజ్ వైపు దూసుకువెళుతున్నట్లు నార్తరన్ అలయెన్స్‌సేనలు చెప్పుకున్నాయి. కుందుజ్ సdుపం లోనిపర్వత ప్రాంతాలపై ఆధిపత్యం సంపాదించామని, త్వరలో కుందుజ్ ను హస్తగతం చేసుకుంటామని ఆ వర్గాలు ధీమా వ్యక్తం చేశాయి. వందలాది మంది తాలిబన్లు తమకు ఆయుధాలుఅప్పగించి లొంగిపోతున్నారని నార్తరన్ అలయెన్స్‌సేనలు తెలిపాయి. మరో వైపు కుందుజ్ లో వున్న వేలాది మంది తాలిబన్లు ఎటువంటి రక్తపాతానికి తావు లేకుండా లొంగిపోయేందుకు మంతనాలు జరుగుతునే వున్నాయి.
కాబూల్ పట్టణాన్ని నార్తరన్ అలయెన్స్‌సేనలు హస్తగతం చేసుకుంటున్నట్లు చెబుతున్నప్పటికీ అక్కడ ఇంకా తాలిబన్లు పోరాటం సాగిస్తున్నారు. యుద్ధం తీవ్రత తగ్గడంతో అంతర్జాతీయ తీవ్రవాది ఒసామాబిన్ లాడెన్ ను పట్టుకోవడంపైనే అమెరికా దృష్టి సారించింది.












Click it and Unblock the Notifications
