ముంబయ్‌ః బిగ్ బుల్ హర్షద్ మెహతా, ఆయన సోదరులు ఇద్దరు సుధీర్ మెహతా,అశ్విన మెహతాలను డిసెంబర్ 7 వరకు పోలీస్ కస్టడీకిపంపారు. ముంబయ్ లోని ప్రత్యేక కోర్టు శుక్రవారం నాడు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. 90బడా కంపెనీలషేర్ల వ్యవహారంలో 250 కోట్ల మేరకు నిధుల దుర్వినియోగానికి పాల్పడిని కేసులో హర్షద్ మెహతా, ఆయన సోదరులను ముంబయ్ పోలీసులుఅరెస్టు చేసిన షయం దితమే.
హర్షద్ సోదరుడుఅశ్విన్ మెహతా ఆస్పత్రిలో వున్న కారణంగా ఆయన ఆస్పత్రి నుంచి డుదలయ్యేంత వరకు ఇంటరాగేట్ చేయవద్దని కోర్టు ఆదేశించింది. లాయర్లతో మాట్లాడే సందర్భంగా ఎలక్ట్రానిక్ డైరీలను ఉపయోగించేందుకు అనుమతించాల్సిందిగా మెహతా సోదరులు చేసుకున్న అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది.












Click it and Unblock the Notifications
