35 మంది అమెరికా సైనికులు హతం
ఇస్లామాబాద్‌ః దక్షిణ అఎn్గానిస్తాన్‌లో తాలిబన్ల చేతిలో కనీసం 35 మంది అమెరికన్ కమెండోలు మరణించినట్టుగా పాకిస్తాన్ వార్తాపత్రికలు వెల్లడించాయి. అల్‌ఖైదా ఉగ్రవాదలు, తాలిబన్ సేనలతో జరుపుతున్న పోరాటంలో అమెరికాన్ కమెండోలు గురు, శుక్రవారాల్లో తీవ్రమైన ప్రాణనష్టం చచూసినట్టుగా ది న్యూస్ పత్రిక వెల్లడించింది.
గగనతలం నుంచి హెలికాప్టర్ గన్‌షిప్స్ అండగా వున్నప్పటికీ తాలిబన్ యోధులు, అల్‌ఖైదా గెరిల్లాలు ఒక్కసారిగా రుచుకుపడటంతో అమెరికన్ కమెండోలు చెల్లాచెదురైపోయారని వెనుతిరిగి పారిపోయే ప్రయత్నంలో శత్రువుల చేజిక్కి ప్రాణాలు పోగొట్టుకున్నారని ఆ పత్రిక తెలిపింది. అయితే అమెరికా మాత్రం ఈ వార్తలను తీవ్రంగా ఖండించింది.
అఎn్గానిస్తాన్ యుద్ధంలో ఇంతవరకు తాము ఒక్క కమెండోను కూడా కోల్పోలేదని అమెరికన్ ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. అయితే పాకిస్తాన్‌లోని జాకోబాబాద్ నుంచి పెద్ద సంఖ్యలో అమెరికన్ హెలికాప్టర్లు అఎn్గానిస్తాన్ దిశగా వెళ్లివచ్చినట్టుగా ప్రత్యక్ష్య సాక్షులు చెప్పారు. సాయ కార్యక్రమాల్లో పాల్గొనే హెలికాప్టర్లు అసాధారణ రీతిలో సంచరించడం చూస్తే ఏదో పెద్ద పత్తే అమెరికాకు ఎదురయినట్టుగా కనిపిస్తున్నదని వారు అంటున్నారు.












Click it and Unblock the Notifications
