భారత్‌తో చర్చలకు పాక్ సిద్ధం
ఇస్లామాబాద్: తాను ఖాట్మండులో ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయితో చర్చలు జరపడానికి సిద్ధమేనని పాకిస్థాన్ అధ్యక్షుడుపర్వేజ్ ముషారఫ్ అన్నారు. అయితే చర్చల్లో కాశ్మీర్ సమస్యనే కీలకాంశం కావాలని ఆయన అన్నారు.
కాశ్మీర్ సమస్యపై తప్ప ఇతరఅంశాలపై పాకిస్థాన్ చర్చలకు సిద్ధంగా లేదని భారత్ చేస్తున్న ప్రచారంలో నిజం లేదని ఆయన అన్నారు.
యూరోపియన్ యూనియన్ ప్రతినిధులు కూడా పాల్గొన్న సంయుక్త dుడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భారత్, పాకిస్థాన్‌లు కాశ్మీర్ సమస్యను ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని యూరోపియన్ యూనియన్ అధ్యక్షుడు, బెల్జియం ప్రధాని గయ్ వెర్హొస్టఫ్‌డట్ సూచించారు.
అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ పాకిస్థాన్‌లో లేడని ముషారఫ్ స్పష్టంచేశారు. పాకిస్థాన్ సైన్యం సరిహద్దు వెంబడి అప్రమత్తంగా వుందని, తనిఖీలు కూడా నిర్వహిస్తోందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
