29మంది వార్ నక్సల్స్ లొంగుబాటు
హైదరాబాద్ : తెలంగాణాలోని వివిధ జిల్లాలకు చెందిన 29 మంది పీపుల్స్‌వార్ నక్సలైట్లు బుధవారం నాడు హైదరాబాద్‌లో రాష్ట్ర డిజిపి ముందు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో పీపుల్స్‌వార్‌లో 6 నెలలనుంచి 10 సంవత్సరాల వరకూ పని చేసినవారు వున్నారని డిజిపి తెలిపారు. లొంగిపోయిన వారిలో వరంగల్ జిల్లాకు చెందిన వారు 18మంది, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన వారు 8మంది, కరీంనగర్ జిల్లాకు చెందిన వారు ముగ్గురు వున్నారు.
వార్ నాయకత్వం అనేసరిస్తున్న పద్దతులు నచ్చక అనేక మంది నక్సల్స్ లొంగుబాటలో పయణిస్తున్నారని డిజిపి హెచ్‌జె దొర అన్నారు. అలాగే, పోలీసులు నక్సల్స్ కుటుంబ సభ్యులతో నిర్వహిస్తున్న కౌన్సిలింగ్ కూడా సత్ఫలితాలనిస్తూ, అధిక సంఖ్యలో నక్సల్స్ లొంగిపోయేలా ప్రభావం చూపుతోందని ఆయన అన్నారు. లొంగిపోయిన నక్సల్స్‌కు పునరావాసం కల్పించేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నట్టు దొర తెలిపారు.












Click it and Unblock the Notifications
