ఎడ్విన్...మేరి కళ్యాణం చూతమురారండి!
తిరుమలః అమెరికాకు చెందిన ఓ యువజంట తెలుగుసంప్రదాయం ప్రకారం వేద మంత్రాల సాక్షిగా తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఒకటైంది. అమెరికాకు చెందిన మేరి, ఎడ్విన్ లు ఆదివారం నాడు తిరుమలలో హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్ళి చేసుకున్నారు. నుదుటన బాషికం కట్టి, పట్టు వస్త్రాలు ధరించి పెళ్ళి పీటల మీద కూర్చున్న మేరి, ఎడ్విన్ తెలుగురాష్ట్రానికి చెందిన మిత్రుల వివాహం చూసి స్ఫూర్తి పొందినట్లు చెప్పారు. ఆ స్ఫూర్తితోనే తిరుమల వచ్చి పెళ్ళి చేసుకుంటున్నట్లు వివరించారు.












Click it and Unblock the Notifications
