బెంగాల్‌ లో ఐఎస్‌ఐ ఏజెంట్‌ అరెస్టు

కోల్‌ కతాః పాకిస్తాన్‌ గూఢచారి సంస్థ ఐఎస్‌ఐ ఏజెంట్‌ ఒకరిని సిలిగురి పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. పశ్చిమబెంగాల్‌ లోని సిలుగురిలో ఐఎస్‌ఐ కార్యకలాపాలు సాగిస్తున్నదనే అనుమానాలతో రాష్ట్రమంతటా అలర్ట్‌ ప్రకటించారు. ఉత్తర బెంగాల్‌ లో ఐఎస్‌ఐ కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు మంగళవారం ఓ ఏజెంట్‌ ను అరెస్టు చేశారు. అరెస్టయిన ఏజెంట్‌ నుంచి కీలక సమాచారం అందిందని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి విలేకరులకు చెప్పారు.

పశ్చిమబెంగాల్‌ లోని సరిహద్దు ప్రాంతాల్లో అలర్ట్‌ ప్రకటించనట్లు ఆయన చెప్పారు. రిపబ్లిక్‌ దినోత్సవం సందర్భంగా భారత్‌ తో విధ్వంసానికి తీవ్రవాదులు కుట్రపన్నినట్లు సమాచారం అందడంతో రైల్వే స్టేషన్లు, బస్టాండుల్లో గాలింపు ముమ్మరం చేశారు. మతపరమైన పనిపై అస్సాం నుంచి పశ్చిమబెంగాల్‌ కు వచ్చిన ఐఎస్‌ఐ ఏజెంట్‌ వద్ద నకిలీ సర్టిఫికెట్లు వున్నాయనే ఆరోపణపై పోలీసులు అరెస్టు చేశారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+