వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తమిళనాడు గవర్నర్‌ రామ్మోహన రావు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ మాజీ పోలీసు డైరెక్టర్‌ జనరల్‌ పి.ఎస్‌. రామ్మోహన రావు తమిళనాడు గవర్నర్‌గా నియమితులయ్యారు. మరో రిటైర్డ్‌ ఐపిఎస్‌ అధికారి శ్యామల్‌ దత్తాను నాగాలాండ్‌ గవర్నర్‌గా నియమిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. వీరు బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచే ఈ ఉత్తర్వులు అమలులోకి వస్తాయి.

రామ్మోహన్‌రావుకు తమిళనాడుతో పరిచయం వుంది. ఆయన చెన్నైలోని ప్రెసిడెన్సీ కాలేజీలో తన విద్యాభ్యాసం చేశారు. కొత్త గవర్నర్‌ నియామకంతో తమిళనాడు ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది. రిపబ్లిక్‌ డే సందర్భంగా గవర్నర్‌ జాతీయ పతాకను ఆవిష్కరించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు రెండు రాష్ట్రాలకు గవర్నర్‌గా వ్యవహరిస్తున్న రంగరాజన్‌ రిజబ్లిక్‌ డే రోజు ఎక్కడ పాల్గొంటారనేది సందిగ్దంగానే వుండిపోయింది. కొత్త గవర్నర్‌ నియామకంతో ఈ సమస్య తీరిపోయింది.

రామ్మోహన్‌ రావును ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అభినందించారు. రామ్మోహన్‌రావుకున్న అపార అనుభవం గవర్నర్‌గా విధులు నిర్వర్తించేందుకు ఉపయోగపడగలదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X