ముసుగు దొంగల స్వైర విహారం
కర్నూలు: కర్నూలు జిల్లా నల్లమల అడవుల్లో శుక్రవారం తెల్లవారు జామున ముసుగు దొంగలు స్వైరవిహారం చేశారు. రెండు ఆర్టీసి బస్సులను, ఒక టాటా సుమోను, ఒక మారుతీ వ్యానును, ఒక మినీ లారీని అడ్డగించి సొమ్ము, నగలు దోచుకున్నారు. ప్రయాణికులపై ఇనుప రాడ్లతో దాడి చేశారు. కత్తులు చూపించి బెదిరించారు.
కర్నూలు- గుంటూరు రహదారిపై దోర్నాల- ఆత్మకూరు మధ్యలో ముసుగు దొంగలు దాదాపు గంటన్నర సేపు నానా బీభత్సం సృష్టించారు.












Click it and Unblock the Notifications
