నక్సల్స్ తో చర్చల భారం సర్కార్ దే!
వరంగల్‌ః వరంగల్ జిల్లా పరకాలలో జలియన్ వాలాబాగ్ మాదిరిగా తెలంగాణా పోరాటంలో అసువులు బాసిన వారికోసం ఓ స్మారక స్థూపాన్ని నిర్మించనున్నట్లు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి విద్యాసాగర్ రావు వెల్లడించారు. ఆదివారం నాడు ఆయన వరంగల్ జిల్లాలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నక్సలైట్లతో చర్చలు జరపాలా వద్దా అనే అంశం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో వున్నదని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ తో పాటు వివిధ రాష్ట్రాలకు బెడదగా పరిణమించిన నక్సలైట్లు నిర్మూలించేందుకు రాష్ట్రాలకు కేంద్రం నిధులు ఇస్తున్నదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
