భక్తులిచ్చే కానుకలతో వ్యాపారమా!
హైదరాబాద్‌ః ఆలయాల నిధులతో పబ్బం గడుపుకోవాలనే ఆలోచనకు స్వస్తి చెప్పాలని తెలుగుదేశం ప్రభుత్వానికి
మిత్రపక్షమైన బిజెపి హితవు చెప్పింది. హిందూ ఆలయాల నిధులతో ఓ బ్యాంక్ ను ఏర్పాటు చేయనున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి దండుశివరామరాజు కొద్దిరోజుల కిందట చేసిన ప్రకటన వివాదాస్పదంగా మారింది. దేనితోనైనా వ్యాపారం చేయెచ్చుకానీ భక్తులు హుండీలో వేసే కానుకలతో వ్యాపారం పనికిరాదని, రాష్ట్రప్రభుత్వం వద్ద డబ్బు లేకపోతే గోదావరిలో భక్తులు విసిరే చిల్లర ఏరుకొని బతకాలని బిజెపి శాసనసభా పక్ష నాయకుడు ఇంద్రసేనారెడ్డి సోమవారం విలేకరుల సమావేశంలో ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications
