విదేశీ ఇన్వెస్టర్ల కోసం సింగిల్ విండోః బాబు
హైదరాబాద్‌ః ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో పాటు బయోటెక్నాలజీ రంగంలో పెట్టుబడులుపెట్టేందుకు విదేశీ సంస్థలు, ప్రవాస భారతీయులు ఆసక్తి చూపించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. పది రోజుల విదేశీ పర్యటన ముగించుకొని ఆయన ఆదివారం తెల్లావారుజామున హైదరాబాద్ చేరుకున్నారు. ఆయన అమెరికా, ఐర్లాండ్, దుబాయ్ లలో పర్యటించి రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలనువివరించారు.
హైదరాబాద్ తో పాటు విశాఖ, విజయవాడ, తిరుపతులనుకూడా పారిశ్రామికంగా అభివృద్ధి చేసే లక్ష్యంతోఅక్కడ కూడా పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానించామనిఆయన చెప్పారు. ప్రతిష్ఠాత్మక నార్త్ కరోలినాకంపెనీతో బయెటెక్ రంగంలో ఒప్పందం కుదిరింది.ఈ సంస్థతో పాటు పలు సంస్థలతో అవగాహన ఒప్పందాలుకుదుర్చుకున్నట్లు చంద్రబాబు నాయుడు వివరించారు.












Click it and Unblock the Notifications
