ఆగ్రాః అమెరికా జర్నలిస్టు డేనియల్ పెరల్ కిడ్నాప్‌లో ప్రధాన పాత్రధారిగా అనుమానిస్తున్న ఒమర్ షేక్ అరెస్టు వ్యవహారం అంతా ఒక నాటకంలా కనిపిస్తున్నదని ప్రధాని వాజ్‌పేయి అనుమానం వ్యక్తం చేశారు.
విమానం హైజాక్ ఉదంతంలో భారత్‌విడుదల చేసిన ముగ్గురు టెర్రరిస్టుల్లో ఒమర్‌షేక్ కూడా ఒకడన్న విషయం తెలిసిందే. ఒమర్ ముందునుంచే పాకిస్తాన్ పోలీసుల అదుపులో వున్నాడని అయితే ఇప్పుడు హఠాత్తుగాఅరెస్టయినట్టుగా ప్రకటించారని వాజ్‌పేయి అన్నారు. ప్రభుత్వానికి తెలియకుండా ఒమర్‌షేక్ వంటి వ్యక్తులు పాకిస్తాన్‌లో తలదాచుకోగలరని తాను భావించడం లేదని ప్రధాని వ్యాఖ్యానించారు. ఆగ్రాలో జరిగిన ఒక ఎన్నికల సభలో మాట్లాడుతూ, భారత్ అణుపరీక్షలు జరిపినట్టుగా పాక్ అధినేత చేసిన ఆరోపణలను కూడా ప్రధాని తీవ్రంగా ఖండించారు. నోటికి ఏదితోస్తే అది మాట్లాడటం పాకిస్తాన్‌కు అలవాటయిందని ఆయన అన్నారు. అమెరికాలో కూచొని భారత్‌పై దుష్ప్రచారానికి దిగితే ఎవరూ నమ్మరని ఆయన చెప్పారు.