విజయవాడః విజయవాడలో తొలిసారిగా అంతర్జాతీయ క్రికెట్ మాచ్ జరుగుతున్నది. జింబాబ్వే, బోర్డ్ 11 జట్ల మధ్య పదిహేను నుంచి మూడు రోజుల పాటు ఈ మాచ్ జరుగుతుంది.
ఈ మాచ్ కోసం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంను తీర్చిదిద్దారు. అంతర్జాతీయ మాచ్‌లకు అనుగుణంగా ఏర్పాట్లు వున్నాయని పిచ్ కూడా బాగున్నదని ఇప్పటికేవిజయవాడ చేరుకున్న జింబాబ్వే జట్టు పేర్కొన్నది. భారత జట్టుతో జరుగనున్నసీరిసీకు తమ జట్టు సన్నద్ధం కావడానికి విజయవాడ మాచ్ ఉపకరిస్తుందని జింబాబ్వే కోచ్‌జెఫ్ మార్ష్ చెప్పారు. మొత్తానికి భారత పర్యటన ప్రపంచకప్‌కు జింబాబ్వే సిద్ధం కావడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు.