వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్‌ మోస్ట్‌ వాటెండ్‌ జాబితా రెడీ

By Staff
|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్‌ః భారత్‌ సమర్పించిన మోస్ట్‌ వాటెండ్‌లిస్ట్‌కు ప్రతిగా పాకిస్తాన్‌ 48 మంది తీవ్రవాదులపేర్లతో తాను ఒక జాబితాను తయారు చేసింది.వీరంతా పాకిస్తాన్‌లో హేయమైన నేరాలకు పాల్పడి భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారని ఆ దేశం ఆరోపిస్తున్నది. వారిని తక్షణమే తమకుఅప్పగించాలని డిమాండ్‌ చేస్తూ ఈ జాబితాను మార్చి మొదటివారంలో భారత్‌కు సమర్పించే అవకాశం వున్నదని చెబుతున్నారు.

ఈ జాబితాలో భారత హోం మంత్రి అద్వానీపేరు వున్నట్టుగా మొదట్లో వార్తలు వచ్చినవిషయం విదితమే. అయితే అద్వానీ పేరు ఈ జాబితాలో లేదని పాకిస్తాన్‌ పత్రికలు వెల్లడించాయి. పాకిస్తాన్‌ రూపొందించిన జాబితాలో అత్యధికులు ఖ్వామీ మూవ్‌మెంట్‌కు చెందిన వారని ఆ పత్రికలు తెలిపాయి.వీరందరికీ భారత్‌ తీవ్రవాదంలో శిక్షణ ఇచ్చి పాకిస్తాన్‌లో హింసాకాండను రెచ్చగొడుతున్నదని పాకిస్తాన్‌ ఆరోపిస్తున్నది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X