రాజ్ నాధ్ మంత్రాంగం-రేపు కౌంటింగ్
న్యూఢిల్లీః ఉత్తరపదేశ్ ముఖ్యమంత్రి రాజ్ నాధ్ సింగ్ ప్రధాని వాజేపేయితో పాటు సీనియర్ బిజెపి నేతల్ని కలుసుకున్నారు. శనివారం ఉదయం ఆయన ప్రధాని వాజ్‌పేయి సమావేశంలో ప్రముఖులతో గంటకుపైగా సమావేశం అయ్యారు. యు.పి. ఎన్నికల ఫలితాలు బిజెపికి ఏమాత్రం అనుకూలంగా లేవనే ఎగ్జిట్ పోల్ ఫలితాలను ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించినట్లు భావిస్తున్నారు. ఈ సమావేశంలో అద్వానీ, బిజెపి అధ్యక్షుడు జానా కృష్ణమూర్తి, మాజీ అధ్యక్షుడు కుశ్ భావ్ ఠాక్రే, యు.పి. బిజెపి అధ్యక్షుడు కల్ రాజ్‌మిశ్రా పాల్గొన్నారు.
ఎగ్జిట్ పోల్ ఫలితాల ప్రకారం సమాజ్ వాది పార్టీ యు.పి.లో అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశాలున్నాయి. బిజెపి రెండో స్థానంలో, బిఎస్ పి మూడో స్థానంలో నిలుస్తాయని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా వుంటుందనిఅంచనా. ఈ పరిస్థితుల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని రాజ్ నాధ్ సింగ్ ప్రధానితో చర్చించారు. బిఎస్పితో పొత్తుపోట్టుకొన్ని బిజెపి మళ్ళీ అధికారంలోకి వస్తుందనే ఊహాగానాలువినిపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం బిజెపి మినహా ఎవరికైనా మద్దతు ఇస్తామని స్పష్టం చేసింది.
రేపు కౌంటింగ్
ఉత్తరప్రదేశ్ తో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరిగిన నాలుగు రాష్ట్రాలలో ఆదివారం ఉదయం నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది. కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉత్తర ప్రదేశ్ ఫలితాలు ఆదివారం మధ్యాహ్నం నుంచే వెలువడే అవకాశాలున్నాయి.












Click it and Unblock the Notifications
