బడ్జెట్ సమావేశాలకు భారీ బందోబస్తు
న్యూఢిల్లీః భారీ బందోబస్తు ఏర్పాట్ల మధ్య పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. పార్లమెంట్‌పై టెర్రరిస్టుల దాడి నేపథ్యంలో సమావేశాలకు ఈ సారి అసాధారణ రీతిలో భద్రతా ఏర్పాట్లు చేశారు. మూడు నెలలపాటు సాగే బడ్జెట్ సమావేశాల్లో ఈ నెల 26న రైల్వే బడ్జెట్, 28న సాధారణ వార్షిక బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. రాష్ట్రపతి కెఆర్ నారాయణన్ సోమవారం ఉదయం పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి చేసే ప్రసంగంతో ఈ సమావేశాలు ప్రారంభమవుతాయి.
బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వాన్ని దుమ్ముదులిపేందుకు ప్రతిపక్ష పార్టీలు కూడా తమతమ వ్యూహాలతో సంసిద్ధమవుతున్నాయి. అయోధ్యపై ప్రధాని వాజ్‌పేయివివాదాస్పద ప్రకటన, రక్షణ మంత్రిగా జార్జ్ ఫెర్నాండెజ్ నియామకం, కార్గిల్ యుద్ధ అమరవీరులకోసం కొనుగోలు చేసిన శవపేటికల వ్యవహారంపై ప్రభుత్వం ప్రతిపక్షాల నుంచి దుమారాన్ని ఎదుర్కునే అవకాశం వుంది. టెర్రరిజంపై కూడా ప్రభుత్వం ప్రతిపక్షాల ఆగ్రహాన్ని ఎదుర్కోవల్సి వుంటుంది.












Click it and Unblock the Notifications
