ధరల పెంపుపై బాబు మండిపాటు

హైదరాబాద్‌/న్యూఢిల్లీ: వంటగ్యాస్‌, కిరోసిన్‌ ధరలు పెంచడాన్ని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తీవ్రంగా వ్యతిరేకించారు. నియోజకవర్గ స్థాయి శిక్షణా శిబిరం ముగింపు సమావేశంలో ఆయన గురువారం మాట్లాడారు. ప్రకృతి
నష్టపోకూడదనే ఉద్దేశంతో ఓ వైపు వంటగ్యాస్‌ను ప్రోత్సహిస్తుంటే కేంద్ర ప్రభుత్వం ధర పెంచడంసరైంది కాదని ఆయన అన్నారు. వంటగ్యాస్‌ ధరపెంపు వల్ల పేదలపై భారం పడుతుందని, పేదలపై భారం పడకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ఆయన అన్నారు.కిరోసిన్‌, ఎల్‌పి గ్యాస్‌ ధరల పెంపు, ఎరువుల సబ్సిడీపై కోత ప్రతిపాదనలను పునఃపరిశీలించాలని భారతీయ జనతా పార్టీ (బిజెపి) ప్రధాన మిత్రపక్షాలు తెలుగుదేశం, తృణమూల్‌ కాంగ్రెస్‌ డిమాండ్‌ చేశాయి. ఈ ప్రతిపాదనల వల్ల నిరుపేదలపై, రైతులపై భారం పడుతుందని ఆ పార్టీలన్నాయి.

బడ్జెట్‌లో ఈ మూడు ప్రతిపాదనలను పునఃపరిశీలించాలని తాము ప్రభుత్వాన్ని కోరినట్లు తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేతకె. ఎర్రంనాయుడు విలేకరులకు చెప్పారు.

ప్రభుత్వానికి తెలుగుదేశం బయటి నుంచి మద్దతు తెలియజేస్తున్నప్పటికీ అది ప్రభుత్వ ఆర్థిక సంస్కరణలను బలపరుస్తోంది. అయితే, ఎల్‌పిజి, కిరోసిన్‌ ధరలపెంపు వల్ల, ఎరువులపై సబ్సిడీ కోత వల్ల పేదలపై, రైతులపై భారం పడుతుందనే ఉద్దేశంతో ఆ పార్టీ అభ్యంతరం తెలియజేస్తోంది.

స్వేచ్ఛా రైతు విధానాన్ని ప్రభుత్వం ఉద్దేశిస్తోందని, దీని వల్ల రైతులుదెబ్బ తింటారని, కిరోసిన్‌, ఎల్‌పిజి ధరల పెంపు వల్లపేదలపై భారం పడుతుందని తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత సుదీప్‌ బంధోపాధ్యాయ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+