లాడెన్, ఓమర్ క్షేమం
మాస్కోః అమెరికాపైసెప్టెంబర్ 11న జరిగిన దాడిలో ప్రధాన నిందితుడుబిన్ లాడెన్, తాలిబన్ల నేత ముల్లా ఓమర్ క్షేమంగా వున్నారని ఆఫ్గనిస్తాన్ మంత్రి యునస్ కునూని వెల్లడించారు. మార్చి 1న ఆయన మాస్కోలోవిలేకరులతో మాట్లాడారు. లాడెన్ కొంతకాలం ఆఫ్ఘనిస్తాన్ లో కొంతకాలం వేరే చోట వుంటున్నట్లు సమాచారంఅందిందని ఆయన చెప్పారు.
సైన్యం కాలుపెట్టలేనంత మారుమూల స్థలాల్లోవీరిద్దరూ తలదాచుకుంటున్నారని ఆయన చెప్పారు. చలికాలంఅయిపోయింది కాబట్టి త్వరలో వీరి స్థావరాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications