ఢిల్లీ చేరిన బాలయోగి భౌతిక కాయం
న్యూఢిల్లీః కృష్ణాజిల్లాలో ఆదివారం ఉదయం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన లోక్‌సభ స్పీకర్ జిఎంసి బాలయోగి భౌతిక కాయాన్ని సోమవారం నాడు ఉదయం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తీసుకువచ్చారు. కేంద్ర మంత్రి రాజీవ్ ప్రతా రుడే, తెలుగుదేశం నాయకుడు ఎర్రన్నాయుడు, బాలయోగి కుమార్తె, కుమారుడు కూడా భౌతిక కాయంతో పాటు హైదరాబాద్ నుంచి వచ్చారు.
విమానం లాండ్ అయింది. అక్కడి నుంచి బాలయోగి పార్థివ శరీరాన్ని డిప్యూటీస్పీకర్ పిఎం సయీద్ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రమోద్ మహాజన్ తదితరులు అధికార లాంఛనాలతో పార్లమెంట్ హౌస్‌కు తీసుకుని పోయారు.విమానాశ్రయంలోనే భౌతిక కాయంపై త్రివర్ణపతాకాన్ని కప్పారు. పూర్తి అధికార లాంఛనాలతో బాలయోగి భౌతిక కాయాన్ని పార్లమెంట్‌హౌస్‌కు తరలిస్తున్నారు. పార్లమెంట్ మూడో నెంబర్ గేటువద్ద వుంచిన ప్రత్యేక వేదికపై బాలయోగి భౌతికకాయం వున్నపేటికను వుంచుతారు. రాజధానిలోని నేతలంతా కడసారి దర్శించుకుని నివాళులర్పిస్తారు.












Click it and Unblock the Notifications
