శంకరాచార్య సూచనకు ముస్లింల ఆమోదం

న్యూఢిల్లీః అయోధ్య సమస్య పరిష్కారానికి కంచి కామకోటి పీఠాధిపతి శంకరాచార్య జయేంద్ర సరస్వతి మధ్యవర్తిగా చేసిన ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చాయి. అయోధ్యలో బాబ్రీ మసీదును కూల్చివేసిన వివాదాస్పద స్థలాన్ని వదిలిపెట్టి దానికి దూరంగా మందిర నిర్మాణాన్ని ప్రారంభించడానికి విహెచ్‌పి చేసిన ప్రతిపాదనను పరిశీలించడానికి ఆల్‌ ఇండియా ముస్లీం లా బోర్డు అంగీకరించింది.

ఈ ప్రతిపాదనపై బోర్డు విస్తృత సమావేశంలో చర్చించి మార్చి పదిహేను లోగా ఏవిషయం కంచి శంకరాచార్యులకు తెలియజేస్తారు.వివాదాస్పద స్థలంపై తుది నిర్ణయాన్ని కోర్టుకు వదలివేస్తారు. కోర్టు తీర్పు వెలువడే వరకు ఆ స్థలానికి దూరంగా వున్న ప్రాంతంలో మాత్రమే విహెచ్‌పి మందిర నిర్మాణం పనులు ప్రారంభిస్తుంది. బోర్డు జనరల్‌సెక్రటరీ సయీద్‌ నిజాముద్దీన్‌, బోర్డు కన్వీనర్‌ ఎస్‌క్యూఆర్‌ ఇలియాస్‌ సారథ్యంలో పన్నెండు మంది సభ్యుల ప్రతినిధి బృందం శంకరాచార్యను కలసి మంతనాలు జరిపింది. ఈ చర్చల్లో మాజీ రాష్ట్రపతి ఆర్‌ వెంకట్రామన్‌, మాజీ గవర్నర్‌ రమేష్‌ భండారీ, సమతా పార్టీ నేత శంభు శ్రీవాస్తవ, మాజీ ప్రధాన న్యాయమూర్తి రంగనాథ్‌మిశ్రా కూడా పాల్గొన్నారు. అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్నే తాను కోరుతున్నట్టుగా శంకరాచార్య ముస్లిం ప్రతినిధులకు చెప్పారు. గుజరాత్‌తో సహా దేశమంతా మతసామరస్య వాతావరణానికి భంగం కలగరాదని ఆయన అన్నారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+