హైదరాబాద్‌ః రాష్ట్రంలో వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం ప్రభుత్వం పలు పథకాలు చేపట్టనున్నట్టుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు.
నాణ్యత విషయంలో మోసానికి పాల్పడితే ప్రైవేట్, ప్రభుత్వ సంస్థలు ఏవైనా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. రాష్ట్రంలోని వినియోగదారులకు చౌకగా నిత్యావసర సరుకులుఅందజేయడానికి సంబంధించిన గృహమిత్ర పథకాన్ని ఆయన ప్రారంభించారు. పబ్లిక్ గార్డెన్స్‌లో జరిగిన సమావేశంలో ఈ పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి గృహమిత్ర ద్వారా నాణ్యమైన నిత్యావసరాలను చౌకగాఅందించనున్నట్టుగా ఆయన చెప్పారు.