అహ్మదాబాద్: అహ్మదాబాద్‌లో శనివారం తెల్లవారుజామున జరిగిన పోలీసు కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, ఎనమండుగురు గాయపడ్డారు. దీంతో అహ్మదాబాద్‌దుదేశ్వర్ క్రాస్ రోడ్ ఏరియాలో నిరవధిక కర్ఫ్యూ విధించారు.
ఇరు వర్గాలకు మధ్య ఘర్షణ చెలరేగింది. దీంతో గుంపును చెదరగొట్టడానికి పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక వ్యక్తి మరణించగా, ఎనమండుగురు గాయపడ్డారు. అహ్మదాబాద్‌లో శుక్రవారం జరిగిన హింసాత్మక సంఘటనల్లో కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడి బంధువుతో పాటు తొమ్మిది మంది మరణించారు. దీంతో కరంజ్, కోలుపూర్, షాపూర్ ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు.