టిటిడి భూముల కబ్జా: సభా సంఘానికి నో
హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) భూముల కబ్జాపై సభా సంఘం ఏర్పాటుకు ప్రభుత్వం నిరాకరించింది. తిరుపతి, రేణిగుంట, మరో ప్రాంతంలో టిటిడి భూములను అక్రమంగా కబ్జా పెట్టారని, ఈ భూముల స్వాధీనంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోందని కాంగ్రెస్ విమర్శించారు. ఈ వ్యవహారంపై సభా సంఘం వేయాలని పట్టుబట్టింది. అందుకు ప్రభుత్వంఅంగీకరించలేదు.
టిటిడి భూములను కబ్జాదారుల నుంచిస్వాధీనం చేసుకుంటామని దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు చెప్పారు. ఈ కబ్జా వ్యవహారాలపై ఒక కమిటీ వేసి, నివేదిక తెప్పించుకుంటామని, నివేదిక ఆధారంగా భూములనుస్వాధీనం చేసుకుంటామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
