పొటో బిల్లుకు లోక్‌సభ ఆమోదం
న్యూఢిల్లీ: ఉగ్రవాద నిరోధక ఆర్డినెన్స్(పొటో) స్థానంలో ప్రతిపాదించిన బిల్లును లోక్‌సభ సోమవారం ఆమోదించింది. బిల్లుకు అనుకూలంగా 261 కోట్లురాగా, వ్యతిరేకంగా 137 ఓట్లు వచ్చాయి. అనంతరం ప్రతిపక్షాలు లోక్‌సభ నుంచి వాకౌట్ చేశాయి.
డిప్యూటీ స్పీకర్ పి.ఎం. సయాద్ ఓటింగ్ వివరాలను ప్రకటిస్తున్న సమయంలో సిపిఎం నాయకుడు సోమనాథ్ ఛటర్జీ లేచి పార్లమెంటు చరిత్రలో ఇది చీకటి రోజని వ్యాఖ్యానించారు. ప్రజల హక్కులపై దాడిని దేశం మరోసారి ఎదుర్కోబోతోందని ఆయన అన్నారు. ప్రతిపక్ష నాయకురాలు సోనియాగాంధీ సహా కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేశారు. అంతకు ముందు హోం మంత్రి ఎల్.కె. అద్వానీ పొటో దుర్వినయోగం కాకుండా మార్పులు చేసినట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications
