వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుజరాత్‌పై జస్టిస్‌ వర్మ దిగ్భ్రాంతి

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః జాతీయ మానవహక్కుల కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ గుజరాత్‌ పరిస్థితి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మతకల్లోలాల బాధితుల్లో భయం ఇంకా పోలేదని నిత్యం అభద్రతతో వారు కాలం గడుపుతున్నారని ఆయన అన్నారు. ప్రజల్లో విశ్వాసం కలిగించే చర్యలను ప్రభుత్వం చేపట్టాల్సి వున్నదని ఆయన అన్నారు.

గుజరాత్‌లో తాను చూసిన దృశ్యాలనుంచి తేరుకోవడానికి తనకు కనీసం మరో రెండు మూడు రోజులు పడుతుందని ఆయన అన్నారు. గుజరాత్‌లో సాధారణ పరిస్థితి కనుచూపు మేరలో కూడా లేదని ఆయన చెప్పారు. గోద్రావిషాదం జరిగి నెలరోజులు గడిచినా పరిస్థితి ఇంకా భయానకంగానే వున్నదని ఆయన అన్నారు. గుజరాత్‌ ప్రభుత్వం ఇచ్చిన ప్రాధమిక నివేదికను తమ కమిషన్‌ తిరస్కరించిందని నాలుగయిదు రోజుల్లో సమగ్రమైన నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించామని ఆయన చెప్పారు. ప్రభుత్వం నివేదిక ఇవ్వని పక్షంలో తమ పర్యటన సందర్భంగాసేకరించి సాక్ష్యాల ఆధారంగానే ఉత్తర్వులు జారీ చేయాల్సివుంటుందని ఆయన చెప్పారు. గోధ్రా, గుల్బర్గా హౌసింగ్‌సొసైటీ ఊచకోత వంటి సంఘటనలపై దర్యప్తు జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు.బాధితులకు నష్టపరిహారం చెల్లించడమనేది ప్రధానం కాదని ముందుగా అక్కడ సాధారణ వాతావరణాన్ని నెలకొల్పడం అదే సమయంలో వారిలో భయాన్ని పోగొట్టివిశ్వాసాన్ని పునరుద్దురించడం ముఖ్యమని ఆయన చెప్పారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X