దాడికి ముందే తప్పించుకున్న లాడెన్
హైదరాబాద్: ముఖ్యమంత్రి పదవి నుంచి నరేంద్ర మోడిని తొలిగించడం గుజరాత్ సమస్యకు పరిష్కారం కాదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెప్పారు. ప్రధాని కార్యాలయం సహాయ మంత్రివిజయ్ గోయల్ సోమవారంనాడిక్కడ చంద్రబాబునాయుడను కలుసుకున్నారు. అనంతరం చంద్రబాబువిలేకరులతో మాట్లాడారు.
గుజరాత్, అయోధ్యలపై తమ వైఖరి స్పష్టంగా ఉన్నదని, సహాయ శిబిరాల్లో ఉన్నవారికి ఆత్మవిశ్వాసం కలిగించాలని, వారికి మెరుగైన సేవలు అందించాలని ఆయన అన్నారు. గుజరాత్ పరిస్థితిపై తాను ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయితో మాట్లాడానని ఆయన చెప్పారు. గుజరాత్‌లో శాంతి సామరస్యాల స్థాపనకు తీసుకునే చర్యలకు తమ మద్దతు వుంటుందని వాజ్‌పేయికి చెప్పినట్లు ఆయన తెలిపారు.
చంద్రబాబునాయుడుతో తాను గుజరాత్ పరిస్థితిపై చర్చించాననివిజయ్ గోయల్ చెప్పారు. లోక్‌సభ స్పీకర్ పదవిపై తమ మధ్య చర్చ జరగలేదని ఆయన చెప్పారు. నరేంద్ర మోడిని తప్పించడం గుజరాత్ సమస్యకు పరిష్కారం కాబోదని ఆయన అన్నారు. సాధారణ పరిస్థితుల స్థాపనకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
