దేశం వెంటే మేం: మమత
కోల్‌కత్తా: గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడికి ఉద్వాసన పలికేవిషయంలో తెలుగుదేశం పార్టీ నిర్ణయమే తమ నిర్ణయమని తృణమూల్ కాంగ్రెస్ నేత మమతా బెనర్జీ స్పష్టం చేశారు. అయితే ఎన్‌డిఎ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించేవిషయం తమ పార్టీ ఆలోచించడం లేదని ఆమె ఆదివారంవిలేకరులతో చెప్పారు.
తమ వ్యవహారాల్లో మిత్రులు జోక్యం చేసుకోరాదన్న బిజెపి వాదనను ఆమె ఖండించారు. మిత్రపక్షాలు బిజెపి వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం లేదని, ప్రభుత్వాన్ని గద్దె దించాలనుకోవడం లేదని, కానీ ప్రజలకు జవాబు చెప్పాల్సింది తాము కాబట్టి మాట్లాడే నైతిక హక్కు తమకు వుంటుందని, తమ ఒత్తిళ్లు తమకు ఉన్నాయని ఆమె అన్నారు. బిజెపి తప్పులకు మిత్ర పక్షాలు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోందని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications
