వన్డే జట్టులో కార్తీక్,సెహవాగ్
ముంబాయి: వెస్టిండీస్‌తో జరిగే వన్డే సిరీస్‌కు ఎంపికయిన భారత జట్టులో ఢిల్లీ బ్యాట్స్‌మన్‌వీరేంద్ర సెహవాగ్‌కు, రైల్వేస్ స్పిన్నర్ మురళీ కార్తిక్‌కు చోటు లభించింది. వెస్టిండీస్‌తో భారత క్రికెట్ జట్టు ఐదు టెస్టుల వన్డే సిరీస్ ఈ నెల 25వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది.
పేస్ బౌలర్ జవగళ్ శ్రీనాథ్‌కు విశ్రాంతి ఇచ్చారు. ప్రస్తుతం టెస్టు మ్యాచ్‌లు ఆడుతున్న జట్టులోంచి శ్రీనాథ్‌తో పాటు వాసిమ్ జాఫర్, సంజయ్ బంగర్, శివసుందర్ దాస్, దీప్ దాస్ గుప్తా, శరణదీప్ సింగ్‌స్వదేశానికి తిరిగి వస్తారు.
18 మందితో కూడిన భారత జట్టు: సౌరవ్ గంగూలీ(కెప్టెన్), రాహుల్ ద్రావిడ్ (వైస్-కెప్టెన్), సచిన్ టెండూల్కర్,వీరేంద్ర సెహవాగ్, వివియస్ లక్ష్మణ్, దినేష్ మోంగియా, మొహమ్మద్‌కైఫ్, యువరాజ్ సింగ్, అజయ్ రాత్రా, జహీర్‌ఖాన్, అజిత్ అగార్కర్, మురళీ కార్తిక్, హర్బజన్‌సింగ్, ఆశిష్ నెహ్రా, టినూ యోహానన్.












Click it and Unblock the Notifications
