ఎన్‌డిఎ యుద్ధ భయం సృష్టిసోంది: సిపిఐ
విజయవాడ: గుజరాత్లో జరిగిన కిరాతక నేరాల నుంచి దృష్టి మళ్లించడానికి జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డిఎ) ప్రభుత్వం వార్‌సైకోసిస్‌ను సృష్టిస్తోందని భారత కమ్యూనిస్టు పార్టీ(సిపిఐ) జాతీయ కార్యవర్గ సభ్యుడు, రాజ్యసభ సభ్యుడు దాసరి నాగభూషణ రావువిమర్శించారు.
రాష్ట్రపతిగా తిరిగి ఆర్‌కె నారాయణన్‌ను ఎన్నుకోవాలనేవిషయానికి తాము కట్టుబడి ఉన్నామని, కాంగ్రెస్‌తో పాటు ప్రతిపక్షాలు నారాయణన్‌ను రెండోసారి రాష్ట్రపతి పదవికి ఎన్నుకోవడానికే ఇష్టపడుతున్నాయని ఆయన అన్నారు.నిషిద్ధ పీపుల్స్‌వార్‌తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్చలు జరపడానికి ముందుకు రావడంపై ఆయన వ్యాఖ్యానిస్తూ ఇరు వైపులా రాజీ ధోరణి చోటు చేసుకోవడం ఆహ్వానించదగిన పరిణామమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
