మాస్కో: కాశ్మీర్‌లో అమెరికా, ఐక్యరాజ్య సమితి బలగాల గస్తీ ప్రతిపాదనలను భారత్ వ్యతిరేకిస్తుందని భారత జాతీయ భద్రతా సలహాదారు బ్రజేష్‌మిశ్రా గురువారం చెప్పారు.
పాకిస్థాన్, భారత్‌ల ఉమ్మడి గస్తీకి భారత్ సానుకూలమేనని ఆయన అన్నారు.ఆ ప్రాంతం అత్యంత సమస్యాత్మకమైందని, ఈ ప్రాంతం ప్రతిఅంగుళం భారత్, పాకిస్థాన్‌లకు తెలుసునని,అందువల్ల భారత, పాకిస్థాన్‌లే ఆ ప్రాంతంలో ప్రతిఅంగుళం గస్తీ చేయగలవని ఆయన విలేకరుల సమావేశంలో అన్నారు.