వినాయకచవితి స్పెషల్ పాలతాలికలు.. ఇలా చేస్తే గణేశుడు కూడా వదిలిపెట్టడు!

వినాయక చవితి పండుగ వచ్చేస్తోంది. అందరూ బొజ్జ గణపయ్యకు రకరకాల నైవేద్యాలను తయారు చేసే పెడుతూ ఉంటారు. అందులో అన్నిటికంటే పాలతాలికలు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఆంధ్ర సాంప్రదాయ వంటకాలలో ఒకటైన పాలతాలికలు పాలు, బెల్లం, బియ్యం పిండితో తయారుచేస్తారు. మరి ఈ పాలతాలికలు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు

తడి లేదా పొడి బియ్యం పిండి - ఒక కప్పు
చిక్కటి పాలు - నాలుగు కప్పులు
బెల్లం తురుము - ఒక కప్పు
సగ్గుబియ్యం - రెండు టేబుల్ స్పూన్లు( గంటపాటు నానబెట్టినవి)
యాలకుల పొడి - అర టీ స్పూను
నెయ్యి - రెండు నుండి మూడు టేబుల్ స్పూన్లు
జీడిపప్పు- 15
కిస్మిస్- 15
బాదంపప్పు- 10
పచ్చి కొబ్బరి ముక్కలు చిన్నగా కట్ చేసుకున్నవి
నీళ్లు- తగినన్ని

Pala thalikalu payasam how to make delicious Pala Thalikalu Payasam at home for ganesh chaturthi

తయారీ విధానము

ముందుగా ఒక గిన్నెలో ఒక అరకప్పు నీళ్లు ఒక చెంచా నెయ్యి, చిన్న బెల్లం ముక్క వేసి మరిగించాలి. నీళ్లు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అందులో బియ్యం పిండి వేసి బాగా కలిపి మరీ పలుచగా కాకుండా తాలికలు వచ్చేలాగా పిండిని కలుపుకోవాలి.

పిండి కొద్దిగా చల్లారిన తర్వాత చేతికి నెయ్యి రాసుకొని పిండిని చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని తాలికలుగా చేసుకోవడం గాని, లేదా మురుకుల పావులను ( ఆంధ్రాలో చక్రాల గిద్దలు) ఉపయోగించి అందులో పిండి నుంచి తాలికలు చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ఒక మందపాటి గిన్నెలో చిక్కటి పాలు ఒక కప్పు నీళ్లు పోసి బాగా మరిగించాలి. ఆ మరుగుతున్న పాలలో నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసి ఉడికించాలి.

సగ్గుబియ్యం ఉడికిన తర్వాత చేసి పెట్టుకున్న బాలికలను ఒక్కొక్కటిగా అందులో వేయాలి. కొద్దిసేపు కదల్చకుండా ఉడికించాలి. వెంటనే గరిట పెట్టి కలిపితే తాలికలు విరిగిపోతాయి కాబట్టి ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ పైన తాలికలను ఉడికించాలి. ఆ తర్వాత తీసి పెట్టుకున్న కొద్దిగా బియ్యం పిండి ముద్దను నీళ్లలో కలిపి ఉడుకుతున్న తాలికల పాశం లో పోయాలి.

ఇన్స్టెంట్ టమాటా నిల్వ పచ్చడి: ఇలా చేస్తే అద్భుతః!
ఇన్స్టెంట్ టమాటా నిల్వ పచ్చడి: ఇలా చేస్తే అద్భుతః!

అప్పుడు దానికి చిక్కదనం వస్తుంది. ఆపై మరో పాత్రలో బెల్లం తురుము పావు కప్పు నీళ్లు పోసి బెల్లం కరిగే వరకు వేడి చేసి వడకట్టి తాలికలు పూర్తిగా ఉడికి పాయసం చిక్కబడిన తర్వాత అందులో పోసి కలపాలి. ఆపై అందులో యాలుకల పొడి వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ , బాదంపప్పు, చిన్నగా కట్ చేసుకున్న పచ్చికొబ్బరి ముక్కలు వేయాలి. ఆపై స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే రుచికరమైన పాలతాలికల పాయసం రెడీ. దీనిని బొజ్జ గణపయ్య చాలా ఇష్టంగా స్వీకరిస్తాడు అని చెప్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+